లిబర్టీలోని ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ క్వార్టర్ కార్యాలయంలో ఇన్ ఛార్జ్ కన్వీనర్ దిడ్డి సుధాకర్ అధ్వర్యంలో ఆదివారం బహదూర్ పురా, యాకుత్ పురా, చార్మినార్, కార్వాన్, తదితర ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. సుధాకర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. చిత్తశుద్ధితో పార్టీని బలోపేతం చేయడంపై అందరు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.