నగరంలోని ఆసిఫ్ నగర్ లో కరోనా కేసులు ఎక్కువ ఉండడంతో ఆ ఏరియాని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరియు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ తో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడున్న స్థానికులతో మంత్రి చర్చించారు. ఇలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కొన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి స్థానికులకు విజ్ఞప్తి చేశారు.