కొత్తగూడెం శాసన సభ్యులు, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షులు కూనంనేని సాంబశివరావుని మక్దుం భవన్ హిమాయత్ నగర్ హైదరాబాద్ లో సన్మానించి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వాల పై ఒత్తిడి తేవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గురువారం వినతి పత్రం సమర్పించారు.