దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిర్వహించిన సర్వే ప్రకారం.. ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. నగరంలోని 62 శాతం హోటళ్లు గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సిటీ పూర్తిగా విఫలమైందని వెల్లడించింది. గడిచిన రెండు నెలల్లో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన నగరంగా హైదరాబాద్ ఉంది.