TG: హైదరాబాద్ పుంజుకుంటోంది. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో అప్లికేషన్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాదిలో 39 శాతం అదనంగా పెరిగినట్లు వివరించారు. కొత్త బిల్డింగ్ పర్మిషన్, లే ఔట్ల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నట్లు తెలిపారు. దీంతో కొత్త బిల్డింగ్ పర్మిషన్, లే ఔట్ల అనుమతుల కోసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.