చంద్ర గ్రహణం బుధవారం ఉదయం 6.12కు ప్రారంభమై, ఉదయం 10.17 గంటలకు ముగిసింది. భారత్‌లో చంద్ర గ్రహణం కనిపించకపోయినా, కొందరు సంప్రదాయాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు, దుకాణం వంటివి శుభ్రం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో గంగాజలం చల్లాలి. పేదలకు ఆహారం దానం చేయాలి. అంతేకాకుండా పేదలకు గోధుమలు, శనగలు, ఉప్పు, బెల్లం, రాగి పాత్రలు వంటివి దానం చేస్తే శుభం జరుగుతుంది.