ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(పీపీ), అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టుల నియామకంలో జరుగుతున్న జాప్యంపై బుధవారం హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలంటూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.