ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు. రచయితలు తమ స్క్రిప్ట్‌ను 250 పదాల నిడివిలో ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. వీక్షకులు చదివి తమ రేటింగ్స్ ఇచ్చేలా సైట్ రూపొందించారు. ఈ సైట్ ద్వారా రైటర్, అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమాలకు పనిచేసే అవకాశాలు పొందవచ్చు.