'ఆర్జీ కర్ లాంటి ఘటన ఇక్కడ జరిగేలా చేస్తా'.. కోల్‌కతాలో వైద్యురాలిని బెదిరించిన వ్యక్తి అరెస్టు

69பார்த்தது
'ఆర్జీ కర్ లాంటి ఘటన ఇక్కడ జరిగేలా చేస్తా'.. కోల్‌కతాలో వైద్యురాలిని బెదిరించిన వ్యక్తి అరెస్టు
కోల్‌కతాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యురాలిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్పిటల్ లో చికిత్స ఆలస్యం అవుతోందని ఓ పేషెంట్ తరఫు బంధువు అయిన దీపక్ సింగ్ అనే వ్యక్తి సిబ్బందితో గోడవకు దిగాడు. ఈ క్రమంలో “మేం ఆర్జీ కర్ లాంటి ఘటన ఇక్కడ జరిగేలా చేస్తాం" అని దీపక్ సింగ్ ఓ వైద్యురాలిని బెదిరించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా కోల్‌కతాలో గత నెలలో 31 ఏళ్ల వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైంది.

தொடர்புடைய செய்தி