ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో విచిత్ర ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన 250 గ్రాముల (పావు కేజీ) బంగాళాదుంపలు చోరీకి గురయ్యాయని అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టి తన బంగాళాదుంపలు వెతికి పెట్టాలని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ జరుగుతున్న దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తాను మద్యం సేవించి తిరిగి వచ్చేసరికి బంగాళాదుంపలు కనిపించడం లేదని ఆరోపించాడు.