రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారిణి హరిచందనను నియమించింది. అలాగే రూ.4,170 కోట్లతో చేపట్టే వరంగల్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పథకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం విషయంలో ప్రాజెక్టు కన్సల్టెంట్ నియామకానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం టెండర్లు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీకి అధికారమిస్తూ జీవో జారీ చేసింది.