అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలో ఈడీ జప్తు చేసిన ఆస్తులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటాచ్ చేసిన ఆస్తులు బాధితులకు ఇచ్చేందుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. ఆస్తులు బాధితులకు ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియను ఈడీ పూర్తి చేసింది. గతంలో కోర్టు ఆదేశాలతో రూ.3339 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తుల ప్రస్తుత విలువ దాదాపు రూ.6 వేల కోట్లుగా అంచనా.