పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా బంగారమే గుర్తుకొస్తుంది. ప్రస్తుత బంగారం ధరలు రూ.90 వేలకు చేరువలో ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర రూ.89 వేలు దాటింది. హైదరాబాద్‌లో సోమవారం ముగింపు సమయానికి 24 క్యారట్ల బంగారం ధర రూ.89,180 గా ఉంది. వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు వేయడం, వాణిజ్య యుద్ధాల భయాల ప్రభావం కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.