ప్రజలను పక్కదారి పట్టించే విధానాలను బీఆర్ఎస్ నాయకులు మానుకొని అభివృద్ధికి సహకరించాలని వనపర్తి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ సూచించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ. తనది ఈ జిల్లా కానట్లుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం ఏ మాత్రం సబబు కాదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలోనే వనపర్తి జిల్లా ఇంతగా అభివృద్ధి చెందిందని అన్నారు.