వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నదాతలు పండించిన వరి ధా
న్యాన్ని చివరి ప్రతి గింజ కొంటామని, సన్నాలు పండించిన ప్రతి రైతుకు రూ.500 అదనంగా చెల్లిస్తామని అన్నదాతలు ఎవరు అధైర్య పడకూడదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.