నారాయణపేట పట్టణంలోని 15వ వార్డులో కొనసాగుతున్న కుటుంబ డిజిటల్ కార్డు సర్వేను శనివారం ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్యరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే చేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్వే ఎలా చేస్తున్నారు. ఏ ఏ వివరాలను నమోదు చేసుకుంటున్నారు అని సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సర్వే పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు పాల్గొన్నారు.