ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలని ఎంపీడీవో సుదర్శన్ సూచించారు. సోమవారం నారాయణపేట మండలం జాజాపూర్ రైతు వేదికలో సర్వే నిర్వహించబోయే సిబ్బందికి ట్రైనింగ్ నిర్వహించారు. సర్వే ఫారం లోని ప్రతీ అంశాన్ని పూర్తి చేయాలని చెప్పారు. సందేహాలు వుంటే తమను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.