నారాయణపేట: ధర్నాను విజయవంతం చేయాలి

71பார்த்தது
నారాయణపేట: ధర్నాను విజయవంతం చేయాలి
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి కోరారు. ఆదివారం నారాయణపేట మండలం కొల్లంపల్లి, చిన్నజట్రం, బోయిన్ పల్లి గ్రామాలలో ధర్నాకు సంబంధించి కర పత్రాలను పంపిణీ చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చెల్లించాలని, రైతు బంధు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி