రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర చట్టం చేసి అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యదర్శి యాదగిరి అన్నారు. ఈనెల 26న జిల్లా కేంద్రంలో చేపట్టే మోటార్ సైకిల్ ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి, అయ్యవారి పల్లి, బోయిన్ పల్లి, లక్ష్మీపూర్, చిన్న జట్రం గ్రామాలలో రైతులకు కర పత్రాలను అందజేశారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.