నారాయణపేట జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఫార్మసిస్ట్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా వైద్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ. ఆసుపత్రుల్లో వైద్యులు ఎంత కీలకమో ఫార్మసిస్ట్ లు అంతే కీలకమని అన్నారు. ఫార్మసిస్టులు బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు.