అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఈనెల 18న వేలం వేస్తున్నట్లు నారాయణపేట జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్ తెలిపారు. మొత్తం 421. 60 క్వింటాళ్ల బియ్యం వేలంపాట వేస్తామని చెప్పారు. ఆసక్తి గలవారు కలెక్టర్ పేరుపై లక్ష రూపాయల డీడీ తీసి ఈనెల 7 నుంచి 14లోగా కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు. డీడీ కట్టిన వారికి బియ్యం చూసేందుకు అనుమతిస్తామని అన్నారు. వేలంపాట కలెక్టరేట్లో నిర్వహిస్తామన్నారు.