దసరా పండుగ సెలవులు ఉన్నందున పండుగలకు సొంత ఊళ్లకు, దూర ప్రాంతాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. దసరా పండుగ దృష్ట్యా చోరీలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. దసరా పండుగకు ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో నగలు, ఆభరణాలు డబ్బు ఉంచరాదు. విలువైన వస్తువులను బ్యాంకు లాఖరులలో భద్రపరచుకోవాలన్నారు