పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కల్పించకుండా కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం ఉట్కూర్ మండలం తిప్రాస్ పల్లి కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. అవకతవకలకు తావు ఇవ్వరాదని హెచ్చరించారు.