మహబూబ్ నగర్: ముదిరాజ్ సంఘం భవనానికి ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన
మహబూబ్ నగర్ జిల్లా కోటకదిరలో ముదిరాజ్ సంఘం భవనానికి సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి కులమతాలకు అతీతంగా సముచితమైన స్థానం, ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులను గత ప్రభుత్వం విస్మరించిందని, భవనం లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.