వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో నేవీ ర్యాడార్ స్టేషన్ పనులకు మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, మంత్రులు బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వికారాబాద్, పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.