మహబూబ్ నగర్: వినియోగదారులు తోడ్పాటు అందించాలి.. ఎస్ఈ రమేశ్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు రెగ్యులేటర్ కమిషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదస్సులో సర్కిల్ పరిధిలో 8, జడ్చర్ల డివిజన్ 23, దేవరకద్ర 3, రాజాపూర్ 3 ఫిర్యాదులు అందాయని ఎస్ఈ రమేశ్ తెలిపారు. వాటి పరిష్కారానికి విద్యుత్తు అధికారులు సిబ్బంది ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు, సిబ్బందికి తోడ్పాటు అందించాలని ఎస్ఈ కోరారు.