ఉద్దేశపూర్వకంగా ఎవరు ఎవరిపై చర్యలు తీసుకోరని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసులు చర్యలు తీసుకున్నారంటూ అనవసరంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారన్నారు. సామాజిక మాధ్యమాలలో పోస్టుల విషయంలో పోలీసులు చూసుకుంటారని వెల్లడించారు.