శాంతి భద్రత పరిరక్షణకు జిల్లా ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ జానకి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. శనివారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో 30-పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని హెచ్చరించారు.