మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సీనియర్ నాయకులు బాదిమి శివకుమార్ జాతీయ రహదారి పనుల కాంట్రాక్టర్, అధికారులతో కలిసి జడ్చర్ల పట్టణంలో రోడ్డు పనులు సమీక్షించారు. నత్తనడకన సాగుతున్న రోడ్డు పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈరోజు రేపు అంటూ కాలయాపన చేయడం తప్ప పనులు ముందుకు సాగకపోవడంతో కాంట్రాక్టరు నిలదీశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.