జడ్చర్ల: లోన్ మంజూరైందని చెప్పి.. రూ. 1 లక్ష 75 వేలు లూటీ
జడ్చర్ల: గంగాపురానికి చెందిన చెన్నకేశవులుకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ భార్యకు మహాలక్ష్మి గ్రూపులో లోను వచ్చిందని, వివరాలు చెప్తే అకౌంట్లో డబ్బులు పడతాయన్నారు. అతడు భూత్పూర్ కు చెందిన మల్లేష్ కు విషయం తెలపగా వారికి మల్లేష్ తన బ్యాంకు వివరాలు ఇచ్చాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఇద్దరి అంకౌట్లలో నుంచి రూ. 1 లక్ష 75 వేలు లూటీ చేశారు. మంగళవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు.