మహబూబ్ నగర్: కాంగ్రెస్ హయాంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుంది
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఉర్దూ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉర్దూ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. గత పదేళ్లుగా విద్యా వ్యవస్థకు ఎంతో నష్టం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందన్నారు.