ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: పీయూ రిజిస్ట్రార్

55பார்த்தது
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు: పీయూ రిజిస్ట్రార్
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలోని బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వంట గదులు, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி