తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు శుక్రవారం స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా. చిక్కుడు వంశీకృష్ణ, డా. కూచికుల్ల రాజేష్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, లక్ష్మీ కాంతరావు పాల్గొన్నారు.