మహబూబ్ నగర్: కెసిఆర్ కు సీఎం రేవంత్ సారీ చెప్పాలి: బిఆర్ఎస్వి
కెసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనియెడల ఎక్కడికక్కడ అడ్డుకుంటామని శనివారం మహబూబ్ నగర్ బిఆర్ఎస్వి నేత, రాష్ట్ర కార్యదర్శి దశరథ్ హెచ్చరించారు. ఓయూలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా అయన మాట్లాడుతూ.. నల్గొండ రాజకీయాలు ఇకనైనా మానేయ్యాలని మండిపడ్డారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సారీ చెప్పాలంటూ బిఆర్ఎస్వి నేతలు డిమాండ్ చేశారు.