గద్వాల: మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
గద్వాల జిల్లా పరిధిలో గుంటుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య ఆదేశాల ప్రకారం మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొబైల్ యాప్ ద్వారా శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.