ఇందిరా మహిళాశక్తి పథకంతో ఆర్థికాభివృద్ధి: దేవరకద్ర ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండల కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి విజయోత్సవ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ ప్రణాళిక ప్రకారం హామీలను నెరవేరుస్తోందన్నారు. మహిళలు మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.