అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కురుమ యాదవ సోదరులకు అందరికీ సదర్ వేడుక సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యెన్నంను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సదరన్ వేడుకలను రాష్ట్రపండుగగా గుర్తించామన్నారు.