TG: ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ చేపట్టడంతో పాటు హైదరాబాద్‌లో లక్ష మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ యూనియన్ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.