విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్ లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ స్కాలర్ షిప్ అనేది ప్రభుత్వం వేసే బిక్ష కాదని అది విద్యార్థుల హక్కు అని వెల్లడించారు. స్కాలర్‌షిప్ లు విడుదల చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.