మహిళా సంఘాలకు పెరటి కోళ్ల పెంపకం కోసం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా గండీడ్ మండల ఏపీఎం అధికారులు లోన్లు విడుదల చేయించారు. కోళ్లను అడ్డాకల్ మండలం నుండి సేకరించి లబ్ధిదారులకు అందజేశారు. వాహనంలో అధిక సంఖ్యలో విక్రయించి లబ్ధిదారులకు అందజేశారు. అందించిన కొన్ని రోజులకే మృతి చెందుతున్నాయని సోమవారం పరమేశ్వరి తెలిపారు. కోడికి 130 రూపాయలు ఉండగా రూ. 150 వసూలు చేశారని, చనిపోయిన కోళ్లకు బాధ్యులు ఎవరని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.