శ్రీకురుమూర్తిలో స్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రతీ ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు స్వామి వారికి రూ. కోట్లల్లో ఆదాయం సమకూరుతున్నా వసతులు కల్పించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన రేకుల షెడ్లల్లోనే భక్తులు స్వామి వారికి నైవేద్యం వండుకుంటున్నారు. ప్రతీసారి బ్రహ్మోత్సవాలు, అమావాస్య, పండుగల సమయాలలలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి స్వామివారికి దాసంగాలు పెట్టి, తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తారు.