దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామికి అలంకరించిన ఆభరణాలను గురువారం ఆత్మకూరుకు తరలించారు. కురుమూర్తి జాతర సందర్భంగా 17 రోజుల క్రితం ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకు నుంచి స్వామి వారి ఆభరాణాలు కురుమూర్తికి తరలించారు. జాతర ముగియడంతో తిరిగి ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంక్ కు చేర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మదనేశ్వర్, ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ శేఖర్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.