గద్వాల జిల్లా మల్దకల్ మండలం బీజ్వరం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి మృతికి కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని.. ఆలిండియా అంబేద్కర్ సంఘం కమిటీ డిమాండ్ చేసింది. జిల్లాల్లోని ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహల దగ్గర కొవ్వొత్తుల నిరసన చేపట్టాలని ఆలిండియా అంబేద్కర్ సంఘం కమిటీ తెలిపింది.