గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సౌజన్యంతో జరగబోయే రైతు సేవా సమితి వారి రైతు సదస్సు పోస్టర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. కావున ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున రైతులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మార్కెట్ కమిటీ సభ్యులు కోరారు.