గద్వాల: గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గిరిజన సమ్మేళనం మంగళవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరుగుతుందని, సమ్మేళనం జరుగు స్థలాన్ని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ శ్రీరాం నాయక్ పరిశీలించారు. ఉదయం 10 గంటలకు ఏలియన్ గ్రౌండ్ నుండి గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో భారీ ప్రదర్శన ర్యాలీ ఉంటుందని వారు తెలిపారు. 11 గంటలకు భక్త రామదాసు కళాక్షేత్రంలో సమ్మేళనం జరుగుతుందని తెలిపారు.