అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అసెంబ్లీ అధ్యక్షుడిగా దేశపోగు జగదీశ్వర్ నియమించబడిన సందర్భంగా ఆయనను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ, పట్టణ అధ్యక్షుడు ఎండి గౌస్ పాషా, మండల ప్రధాన కార్యదర్శి మౌలానా, బల్మూర్ మండల ఉపాధ్యక్షుడు స్వామి గౌడ్, ఐఎన్టీయూసీ నాయకులు నగేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు.