AP: అనంతపురం, హిందూపురంలో నలుగురు కమర్షియల్ టాక్స్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయడంలో సీటీఓ కృష్ణవేణి, డీసీటీఓలు రాజశేఖర్ రెడ్డి, మధుసూధన్, ఇంతియాజ్ లు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. జీఎస్టీ వసూళ్ల విషయంలో వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నతాధికారులు వారిపై నిఘా పెట్టి.. నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.