బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా శుక్రవారం నుంచి తొలి టెస్ట్ ఆడనున్నాయి. అయితే కుమారుడు పుట్టడంతో రోహిత్ శర్మ మొదటి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది.
మొదటి టెస్టులో ఆడే తుది జట్టుపై బుమ్రా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.