మహారాష్ట్రలోని భివాండీలో ఫిబ్రవరి 20న జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేసి.. అతడి నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.