ప్రకృతి ప్రకోపానికి అందరూ ఒక్కటే.. దానికి ధనిక, పేద అని తేడా ఉండదని మరోసారి రుజువైంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో వ్యాపించిన కార్చిచ్చు ఐదు రోజులుగా రగులుతూనే ఉంది. ఆ రాష్ట్ర జీడీపీ (3.9 ట్రిలియన్ డాలర్లు) మన దేశ జీడీపీ కంటే ఎక్కువ. వ్యాపార, రాజకీయ దిగ్గజాలు, హాలివుడ్ సెలబ్రిటీలు అక్కడే ఉంటారు. తాజా కార్చిచ్చుతో వారంతా బతుకుజీవుడా అంటూ కోట్ల విలువైన ఆస్తులను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.